‘పది’ పరీక్షలయ్యాక టీచర్ల బదిలీలు

ABN , First Publish Date - 2020-06-04T10:31:25+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మూడేళ్లుగా బదిలీలు జరగకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ..

‘పది’ పరీక్షలయ్యాక  టీచర్ల బదిలీలు

జిల్లాలో 1555 మందికి స్థానచలనం


నెల్లూరు (విద్య), జూన్‌ 3 : ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మూడేళ్లుగా బదిలీలు జరగకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు బదిలీలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత, పాఠశాలల పునః ప్రారంభంలోపు బదిలీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు 8 ఏళ్లు, హెచ్‌ఎంలు 5 ఏళ్లపాటు ఒకే పాఠశాలలో పనిచేసి ఉంటే వారిని తప్పక బదిలీ చేయనున్నారు. 


జిల్లా వ్యాప్తంగా ప్రాఽథమిక పాఠశాలలు 2,611, ప్రాథమికోన్నత పాఠశాలలు 380, ఉన్నత పాఠశాలలు 413 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలల్లో 4,960, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,100, ఉన్నత పాఠశాలల్లో 4,395 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లకుపైగా పనిచేస్తున్న 1555 మందికి స్థాన చలనం కలగనుంది. 140 మంది ప్రధానోపాధ్యాయులు కూడా బదిలీ కానున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1241 ఖాళీలు(క్లియర్‌ వేకెన్సీ) ఉన్నాయి. ఎస్జీటీలు 895 ఖాళీలుండగా 800 మంది 8 ఏళ్లు పూర్తి చేసిన వారు ఉన్నారు.


అలాగే ఎస్‌ఏ తెలుగులో 8 ఏళ్లు పూర్తయిన వారు 67 మంది, హిందీలో 118 మంది ఉన్నారు. ఇంగ్లీష్‌లో 53 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 38 మంది, మ్యాథ్స్‌లో 16 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 74 మంది, ఫిజికల్స్‌లో 8 ఏళ్లు పూర్తయిన వారు 56 మంది, బయాలజీలో 42 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 75 మంది, సోషల్‌లో 86 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 74 మంది ఉన్నారు. అలాగే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 37 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 106 మంది, గ్రేడ్‌-2 హెచ్‌ఎం 11 పోస్టులు ఉండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 103 మంది ఉన్నారు.


ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 101 ఖాళీలుండగా 8 ఏళ్లు పూర్తయిన వారు 23 మంది, పీఈటీల్లో 8 ఏళ్లు పూర్తయిన వారు 21 మంది ఉన్నారు. వీరి జాబితాను పాఠశాల విద్యాశాఖకు పంపించామని, పూర్తి విధివిధానాలు, మార్గదర్శకాలు విడుదల చేస్తే స్పల్ప మార్పులు, చేర్పులతో బదిలీలు నిర్వహిస్తామని డీఈవో జనార్థనాచార్యులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. 

Updated Date - 2020-06-04T10:31:25+05:30 IST