ఉపాధ్యాయ బదిలీలపై ఊగిసలాట

ABN , First Publish Date - 2020-05-28T08:48:15+05:30 IST

బదిలీల సమస్య ఉపాధ్యాయులను వేధిస్తోంది. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్‌ తదితర విద్య, ఉపాధ్యాయుల అనేక సమస్యలు

ఉపాధ్యాయ బదిలీలపై ఊగిసలాట

  • ఇటీవల ఖాళీలు, స్టేషన్‌, సర్వీసు వివరాలడిగిన కమిషనర్‌
  • రిపోర్టు చేసిన జిల్లా అధికారులు
  • క్లియర్‌ ఖాళీలు 1015 పోస్టులు
  • 8 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు 1644 మంది
  • రాష్ట్ర శాఖ మార్గదర్శకాలు రాక 
  • టీచర్లలో అయోమయం


అనంతపురం విద్య, మే 27 : బదిలీల సమస్య ఉపాధ్యాయులను వేధిస్తోంది. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్‌ తదితర విద్య, ఉపాధ్యాయుల అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇపుడు బదిలీల ఆశలతో ఊరి స్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 తర్వాత నేటి వరకూ ఉపాధ్యాయ బదిలీలు జరగలేదు. అయితే తాజాగా 5 ఏళ్ల సర్వీసు ఉన్న హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్లు సర్వీసున్న టీచర్లు, ఖాళీలు తదితర వివరాలను పంపాలంటూ విద్యాశాఖ కమిషనరేట్‌ అధికారులు జిల్లా అధికారులను కోరారు. దీంతో ఇటీవలే జిల్లా విద్యాశాఖ అధికారులు సంబంధిత ఫార్మాట్‌లో వివరాలను నివేదించారు. పైనుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో... ఉపాధ్యాయలోకం అసహనంలో ఉంది.


కటాఫ్‌పై టీచర్లలో పెదవి విరుపు

బదిలీలకు కటాఫ్‌ డేట్‌ను ఫిబ్రవరి 28ని తీసుకున్నారు. జూలై నెలలో భారీగా ఉపాధ్యాయులు, పలువురు ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబవ్రరిని తీసుకుంటే జూలైలో పదవీ విర మణ ద్వారా ఖాళీ అయిన స్థానాలను కోల్పోవాల్సి ఉం టుంది. దాదాపు 20 శాతం ఖాళీలు కోల్పోవాల్సి ఉంటుం దన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జూలై చివరి తేదీని కటాఫ్‌ తేదీగా తీసుకోవాలన్న డిమాండ్‌ అన్ని సంఘాల నుంచి వినిపిస్తోంది. అయితే రాష్ట్ర అధికారులు కేడర్‌, ఖాళీలు తదిర సమాచారాన్ని జిల్లాల నుంచి తీసు కున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇంకా విడు దల చేయలేదు. పైగా కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత రావా ల్సి ఉంది. మరోవైపు బదిలీలపై పైస్థాయి నుంచి స్పష్టత రాకపోవడంతో ఉపాధ్యాయుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-05-28T08:48:15+05:30 IST