నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-10-20T08:22:11+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం డీఈవో చంద్రకళ ఉపాధ్యాయ

నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ

గుజరాతీపేట, అక్టోబరు 19: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం డీఈవో చంద్రకళ ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను వివరించారు. డీఈవో మాట్లాడుతూ ముందుగా స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ధ్రువపత్రాలను పరిశీలిస్తామని చెప్పారు. వారి వద్ద నుంచి అంగీకారపత్రం తీసుకుంటామన్నారు.


వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ఉపాధ్యాయులు కౌన్సిలింగ్‌కు రానవసరం లేదన్నారు. అంగవైకల్యం ఉన్న వారి సర్టిఫికేట్లను ఎక్స్‌పర్ట్‌ కమిటీ పరిశీలించిన తరువాతే బదిలీ చేస్తామన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్లు పొందిన వారికి బదిలీలు పూర్తయిన తరువాత పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వానా కామేశ్వరరావు, టెంక చలపతిరావులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-10-20T08:22:11+05:30 IST