పగలు పాఠాలు చెప్పే టీచర్.. రాత్రివేళ ఆ పని చేసేవాడు.. చివరికి అతడి గతి ఏమైందంటే..

ABN , First Publish Date - 2021-12-07T12:00:12+05:30 IST

మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్ర్రంలో.. డబ్బు సంపాదించడానికి ఇదే అవకాశంగా భావించాడు ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. మద్యం ఫుల్ డిమాండ్ ఉండడంతో.. పగలు పాఠాలు చెబుతూ రాత్రి వేళ తన ఇంట్లోనే మద్యం విక్రయించేవాడు...

పగలు పాఠాలు చెప్పే టీచర్.. రాత్రివేళ ఆ పని చేసేవాడు.. చివరికి అతడి గతి ఏమైందంటే..

మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్ర్రంలో.. డబ్బు సంపాదించడానికి ఇదే అవకాశంగా భావించాడు ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. మద్యం ఫుల్ డిమాండ్ ఉండడంతో.. పగలు పాఠాలు చెబుతూ రాత్రి వేళ తన ఇంట్లోనే మద్యం విక్రయించేవాడు. పోలీసులకు సమాచారం అందడంతో.. ఒక్కసారిగా అతిని ఇంట్లో తనిఖీ జరిగింది. దీంతో ఆ బడి పంతులు నేరుగా దొరికిపోయాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్ర్రంలో జరిగింది.


వివరాలలోకి వెళితే.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత కొంత కాలంగా రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం విధించారు.  దీంతో అక్కడ మందుబాబులు మద్యం కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా తీసుకొని సురేంద్ర అనే ఒక స్కూల్ టీచర్ తన ఇంట్లోనే మద్యం తయారు చేసి విక్రయించేవాడు. చుట్టు పక్కల వారికి అధిక రేట్లకు అక్రమంగా మద్యం సరఫరా చేసి డబ్బు కూడా బాగా సంపాదించాడు.


అయితే సురేంద్ర చేసే అక్రమ మద్య వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడి ఇంట్లో ఒక్కసారిగా తనిఖీ చేసి పట్టుకున్నారు. సురేంద్రను పోలీసులు విచారణ చేయగా.. అతను పది సంవత్సారాల ముందుకూడా ఇలాగే నాటు సారా తయారీ నేరంలో పట్టుబడ్డాడని తెలిసింది. ప్రస్తుతం అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.


సురేంద్ర తండ్రి ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. దీంతో అతనికి తండ్రి చేసే ఉద్యోగం లభించింది. కానీ టీచర్‌గా పనిచేస్తున్నా.. అతను మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు మద్యం విక్రయించేవాడు.


సురేష్‌తోపాటు గత కొన్ని రోజులలో పోలీసులు వివిధ ప్రభుత్వ రంగాలలో పనిచేసే నలుగురిని అరెస్టు చేశారు. వారంతా మద్యనిషధం ఉన్నసమయంలో దొంగచాటుగా మద్యం అక్రమ రవాణా చేసే వారు.

Updated Date - 2021-12-07T12:00:12+05:30 IST