పాక్ జట్టు విజయంపై indian Teacher హర్షం...ఉద్యోగం నుంచి తొలగింపు

ABN , First Publish Date - 2021-10-26T14:33:52+05:30 IST

పాక్ క్రికెట్ జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన...

పాక్ జట్టు విజయంపై indian Teacher హర్షం...ఉద్యోగం నుంచి తొలగింపు

జైపూర్ : పాక్ క్రికెట్ జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన  రాజస్థాన్‌ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసినందుకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.నఫీసా అత్తారి అనే మహిళా ఉపాధ్యాయురాలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్‌లో పని చేసేది. పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది.


‘‘మేం గెలిచాం’’ అని పేర్కొన్న పాకిస్థాన్ ఆటగాళ్ల చిత్రాలతో పాటు వాట్సాప్ స్టేటస్ ద్వారా నఫీసా సంతోషం వ్యక్తం చేసింది.మీరు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నారా అని తల్లిదండ్రుల్లో ఒకరు ఉపాధ్యాయురాలిని అడిగినప్పుడు, నఫీసా ‘‘అవును’’ అని సమాధానమిచ్చింది.వాట్సాప్‌లో టీచర్ స్టేటస్ స్క్రీన్‌షాట్‌లు వ్యాపించడంతో స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేర టెర్మినేషన్ లెటరును నీరజ్ మోదీ స్కూలు యాజమాన్యం జారీ చేసింది. 


Updated Date - 2021-10-26T14:33:52+05:30 IST