బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు మెసేజ్.. విషయం తెలుసుకుని షాక్.. కూతురి అసభ్యకర ఫొటోలు తీసిన టీచర్..

ABN , First Publish Date - 2022-01-30T22:16:13+05:30 IST

అతను గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు.. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన వాడు..

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు మెసేజ్.. విషయం తెలుసుకుని షాక్.. కూతురి అసభ్యకర ఫొటోలు తీసిన టీచర్..

అతను గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు.. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన వాడు.. అలాంటిది నీచమైన పనికి పాల్పడి కటకటాల వెనక్కి వెళ్లాడు.. తన విద్యార్థినిని అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.. ఆ విద్యార్థినిని బెదిరించి ఆమె తండ్రి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొట్టేశాడు.. విషయం బయటపడడంతో జైలు జీవితం గడుపుతున్నాడు.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జోధ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జితేందర్ సింగ్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అసభ్యకర రీతిలో ఫొటోలు తీశాడు. అనంతరం వాటితో బెదిరింపులకు దిగాడు. ఆమె తండ్రి ఏటీఎమ్ కార్డు, పిన్ నెంబర్, సిమ్ కార్డు తీసుకురాకపోతే ఫొటోలను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. భయపడిన బాలిక జితేందర్ చెప్పినట్టే చేసింది. వాటిని ఉపయోగించి బాధిత బాలిక తండ్రి ఖాతా నుంచి జితేందర్ రూ.2.83 లక్షలు కాజేశాడు. 


కొన్ని రోజుల తర్వాత బాలిక తండ్రి బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. ఖాతాలో డబ్బులు లేనట్టు తెలిసింది. షాకైన బాలిక తండ్రి భార్యను, కూతురిని ప్రశ్నించాడు. దీంతో కూతురు నిజం చెప్పేసింది. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించి జితేందర్ సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జితేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-01-30T22:16:13+05:30 IST