కారు టైరు ఊడిపోయిన దృశ్యం (అంతర చిత్రంలో) మృతిచెందిన వేణుగోపాల్
నారాయణపేటరూరల్, జనవరి 26 : గణతంత్ర వేడుకలకు వెళుతూ కారు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన పేట మండలంలోని కోటకొండ శివారులోని శ్మశాన వాటిక వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన వేణుగోపాల్(42) కోయిల్‌కొండ మండలం అమ్రానాయక్ తండాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మక్తల్‌లోని గురుకులంలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో కొన్ని నెలలుగా మక్తల్‌లోనే ఉంటున్నారు. అయితే, గణతంత్ర వేడుకలకు గాను మక్తల్ నుంచి కారులో కోయిల్‌కొండకు వెళ్తుండగా కోటకొండ శివారులో కారు అదుపు తప్పి కింద పడడంతో బలమైన గాయాలై వేణుగోపాల్ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పేట జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.