crypto exchange వ్యాపారంపై... తక్షణ ప్రభావం చూపిన TDS

ABN , First Publish Date - 2022-07-06T02:02:14+05:30 IST

భారత్‌లోజరిగిన అన్ని క్రిప్టో ట్రేడ్‌లలో ఒక శాతం కోసం అడిగే కొత్త ‘పన్ను మూలాధారం(TDS)’ నియమాలు క్రిప్టో ఎక్స్ఛేంజీల వ్యాపారంపై తక్షణ ప్రభావాన్ని చూపాయి.

crypto exchange వ్యాపారంపై...  తక్షణ ప్రభావం చూపిన TDS

ముంబై : భారత్‌లోజరిగిన అన్ని క్రిప్టో ట్రేడ్‌లలో ఒక  శాతం కోసం అడిగే కొత్త ‘పన్ను మూలాధారం(TDS)’  నియమాలు క్రిప్టో ఎక్స్ఛేంజీల వ్యాపారంపై తక్షణ ప్రభావాన్ని చూపాయి. కొత్త TDS నియమాలు మొదట ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్‌లో ప్రవేశించి, జూలై 1 నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లోని మూడు అతిపెద్ద ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు కనీసం 70 శాతం మేర పడిపోయాయి. ఎక్స్ఛేంజీలు సాంప్రదాయకంగా వారాంతాల్లో కొన్ని ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుదలను చూస్తుండగా, కొత్త నియమాలు వారంలో కూడా ట్రేడ్‌లపై తిరోగమనం వేపే ఒత్తిడిని కొనసాగించవచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2022-07-06T02:02:14+05:30 IST