Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 23 Jan 2022 23:49:32 IST

టీడీపీ యువ రథసారధి నారా లోకేశ్‌

twitter-iconwatsapp-iconfb-icon
టీడీపీ యువ రథసారధి నారా లోకేశ్‌ రిమ్స్‌లో అన్నం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న అమీర్‌బాబు, హరిప్రసాద్‌

పుట్టిన రోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు

కడప (మారుతీనగర్‌), జనవరి 23: తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీ సుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్‌ యువ రథసారధిగా ముం దుకెళుతున్నారని పార్టీ నేతలు కొనియాడారారు. లోకేశ్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత టీడీపీ జిల్లా కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. అనంతరం కొత్త రిమ్స్‌ వద్ద కడప వాణిజ్య విభాగం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆఽ ద్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, నాయకులు పీ రయ్య హాజరై మాట్లాడారు. టీడీపీ ఉజ్వల భవిష్యత్తుకు లోకేశ్‌ తన తాత నందమూరి ఆశయాలు, తండ్రి నారా చంద్రబాబు ఆలోచనలతో శ్రమించే కార్మికుడుగా మారారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు సునీ త, టీడీపీ నాయకులు జయకుమార్‌, సుధాకర్‌యాదవ్‌, రాంప్రసాద్‌, జియావుద్దీన్‌, ద్వారకానాథ్‌, సుబ్బారెడ్డి, అఫ్జ ల్‌, వెంకటేష్‌, చాన్‌బాష, వరప్రసాద్‌ పాల్గొన్నారు. 


కమలాపురంలో...

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకల ను ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరు పు కున్నారు. తెలుగుయువత మండల నాయకులు ఏర్పా టు చేసిన కేక్‌ కటింగ్‌ కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు పుత్తా లక్ష్మీరెడి ్డపాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబునాయు డు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధిపథంలో నడిచిందన్నారు. 

తాత, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకుని పార్టీలో ఉన్నత బాధ్యతలు వహిస్తూ అటు పార్టీ అభివృద్ధికి ఇటు కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్న నారా లోకేశ్‌ ఇలాంటి జన్మదిన వే డుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.  అనంతరం కేక్‌ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కా ర్యక్రమంలో మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు ఖాదర్‌బాష, రామయ్య, ఎర్రబల్లి చిన్నసుబ్బారెడ్డి, మల్లే్‌ష రాయల్‌, ఆస్పత్రి మాజీ ఛైర్మన్‌ జంపాల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పెండ్లిమర్రిలో...

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను మండల కేంద్రానికి సమీపంలోని పగడాలపల్లె గంగమ్మ ఆలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కరోనా నుం చి త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నమయ్య, ఈశ్వర్‌రెడ్డి, ఆరవేటి చంద్రారెడ్డి, చండ్రాయుడు, శ్రీనాథ్‌, ఈశ్వర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 


సీకేదిన్నెలో...

నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకొమ్మదిన్నెలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌, పుత్తా నరసింహారెడ్డి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు స్థానిక కొత్తపేట వద్దగల గంగమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. మండల ఇన్‌చార్జి టక్కోలి వెంకటకృష్ణారెడ్డి, గందం మోహన్‌బాబు, బాస్కర్‌రెడి ్డ, రాజారావు, మహేష్‌, గోపాల్‌, దర్బార్‌బాష తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.