ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు స్వాహా

ABN , First Publish Date - 2020-07-01T08:30:15+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు వేల కోట్లు స్వాహా చేశారని టీడీపీ నేతలు విమర్శించారు. ఊరికి దూరంగా ఉన్న భూములను విపరీతమైన ధరకు ప్రభుత్వంతో కొనిపించి కోట్లు...

ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు స్వాహా

‘మా ఐదేళ్ల పాలనలో రూ. ఆరున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు వేశారు. ఐదేళ్ల బడ్జెట్‌ కూడా అంత లేదు. ఏం చేయాలో తెలియక అచ్చెన్నాయుడిపై పడ్డారు.’


‘దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను నిర్దాక్షిణ్యంగా లాక్కుంటున్నారు. ఆత్మహత్యాప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ నేతల్లో కనికరం లేదు.’


పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు వేల కోట్లు స్వాహా  చేశారని టీడీపీ నేతలు విమర్శించారు. ఊరికి దూరంగా ఉన్న భూములను విపరీతమైన ధరకు ప్రభుత్వంతో కొనిపించి కోట్లు కమీషన్లుగా దండుకున్నారని.. ముంపు భూముల్లో, శ్మశానాలో, కొండల్లో స్ధలాలిచ్చి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల జేబుల్లోకి కనీసం రూ. ఐదు వేల కోట్లు చేరాయని ఓ నేత చెప్పారు. టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తయున ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధిస్తున్నారని నేతలు విమర్శించారు. సోషల్‌ మీడియా పోస్టుల పేరుతో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు.. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ఎంత అరాచకానికి పాల్పడుతున్నా కిమ్మనడం లేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర  మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, మాజీ డీజీపీ వంటి వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినా కేసులు పెట్టలేదని, మంత్రి.. కంత్రి... ఇంతి అన్న పోస్టింగులో ఎవరి పేరూ లేకపోయినా 70 ఏళ్ల వ్యక్తిపై కేసు పెట్టి అరెస్టు చేశారని విమర్శించారు. సుప్రీం తీర్పు ప్రకారం పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తొలగిస్తున్నట్లుగానే రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వాటర్‌ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు వేసిన రంగులు కూడా తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-01T08:30:15+05:30 IST