బాగాలేనిది ఆర్థిక స్థితి కాదు.. జగన్‌ మానసిక పరిస్థితి

ABN , First Publish Date - 2020-04-03T08:47:34+05:30 IST

బాగాలేనిది ఆర్థిక స్థితి కాదు.. జగన్‌ మానసిక పరిస్థితి

బాగాలేనిది ఆర్థిక స్థితి కాదు.. జగన్‌ మానసిక పరిస్థితి

టీడీపీ నేతల ఆగ్రహం


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): బాగా లేనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. ముఖ్యమంత్రి జగన్‌ మానసిక స్థితి అని టీడీపీ సీనియర్‌నేతలు దుయ్యబట్టారు. ‘‘జగన్‌ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ విధించిన వారం రోజులకే ఆర్థిక పరిస్థితులు బాగోలేవని చేతులు ఎత్తేశారు. ఒకపక్క పేదలు అల్లాడుతుంటే, సందట్లో సడేమియా అన్నట్లు గడిచిన రెండు రోజుల్లోనే కావాల్సిన కాంట్రాక్టర్లకు రూ6,400కోట్ల బిల్లులు విడుదల చేశారు. ఉన్న డబ్బు ఉద్యోగుల జీతాల దగ్గరకు వచ్చేసరికి మాయమైందా?’’ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారని ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రశ్నించారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమ కూడా ట్విటర్‌లో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

Updated Date - 2020-04-03T08:47:34+05:30 IST