ప్రకాశం: జిల్లాలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బల్లికురవ మండలం గుంటుపల్లిలో 149 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ప్రకాశం మల్లయపాలెంలో 50 ఓట్లతో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. కొమ్మినేనివారిపాలెంలో 7 ఓట్లతో టీడీపీ మద్దతుదారు విజయకేతనం ఎగురవేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష అభ్యర్థుల మీద వైసీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మద్దతుతో పలు ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికలకు టీడీపీ దూరం కావడంతో పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. సర్పంచి, మున్సిపాలిటీ ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగు నమోదైతే.. అదే స్థానిక సంస్థలైన పరిషత్ ఎన్నికల్లో మాత్రం 61.34 శాతంగా నమోదైంది.