Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుప్పంలో TDP VS YSR Congress

చిత్తూరు: కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బూతు పురాణం వల్లించి, ఆయన వాహనాలపై బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ రెస్కో చైర్మన్ సెంథిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సదరు వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జనాగ్రహ దీక్షలో ఉన్న వైసీపీ శ్రేణులు తమ ఆందోళన కార్యక్రమం అయ్యాక టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో రోడ్డుపై ఇరువర్గాల మధ్య బాహాబాహి జరిగింది. భారీగా టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో దీక్ష చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడటంతో తోపులాట జరిగింది. తోపులాట తీవ్రస్థాయికి చేరడంతో భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని ఇరువర్గాలకూ పోలీసులు నచ్చజెప్పారు.

Advertisement
Advertisement