Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై మండిపడుతూ టీడీపీ ఆందోళన

విశాఖ: వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై మండిపడుతూ టీడీపీ నేతల ఆందోళనకు దిగింది. ఉడా కార్యాలయం వద్ద మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆందోళనలోకి దిగారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో ఎన్నో అవకతవకలున్నాయని ఆరోపించారు. కొత్త ప్లాన్‌తో సామాన్యలుకు ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్‌-2041 ప్రజలకు అర్థం కాకుండా వీఎంఆర్‌డీఏ చివరి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టనిపిస్తోందని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలుగులో వివరాలు పొందుపరచకపోవడం, మాస్టర్‌ప్లాన్‌ రహదారుల సర్వే నంబర్లు ప్రచురించకపోవడం, గత మాస్టర్‌ ప్లాన్‌ వివరాలు ఎక్కడా ప్రస్తావించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తం ఇంగ్లీష్‌లో ఉందని, ఏమీ అర్థం కావడం లేదని, తెలుగులో ప్లాన్‌ వివరాలు పొందుపరచాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement