ఆస్తిపన్నును తగ్గించాలంటూ విజయవాడలో టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2021-06-15T17:35:09+05:30 IST

పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ఆస్తిపన్నును తగ్గించాలంటూ విజయవాడలో టీడీపీ ఆందోళన

విజయవాడ: పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో అశోక్ నగర్‌లోని వార్డు సచివాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి అద్దె విలువ ఆధారితంగానే ఇంటి పన్ను విధిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఇచ్చేది గోరంత.. ట్యాక్స్‌ల రూపంలో దండుకునేది కొండంత అని మండిపడ్డారు. పెరిగిన ఆస్తి పన్నులతో సామాన్యుల పరిస్థితి అతలాకుతలమవుతోందని తెలిపారు. ఆస్తి పన్ను పెంపు పేరుతో జారీ చేసిన జీఓలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలపై భారం వేయమని చెప్పిన వైసీపీ నేతలు అడ్డగోలుగా ట్యాక్స్‌లు పెంచారన్నారు. కౌన్సిల్‌లో కూడా ఎటువంటి చర్చ లేకుండానే ప్రజలపై పన్నుల రూపంలో భారాలు మోపారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను మరింత ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయటం భావ్యంకాదని గద్దె రామ్మోహన్ అన్నారు. 

Updated Date - 2021-06-15T17:35:09+05:30 IST