పేదలపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-20T05:14:24+05:30 IST

తొండంగి, అక్టోబరు 19: ప్రభుత్వం పేదలపై పెంచిన విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించి వారిని ఆదుకోవాలని టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు డిమాండ్‌ చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా ఏ.కొత్తపల్లిలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీవు రచించిన రాజ్యంగాన్ని

పేదలపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించాలి
ఏ.కొత్తపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న కృష్ణుడు

టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు 

తొండంగి, అక్టోబరు 19: ప్రభుత్వం పేదలపై పెంచిన విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించి వారిని ఆదుకోవాలని టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు డిమాండ్‌ చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా ఏ.కొత్తపల్లిలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీవు రచించిన రాజ్యంగాన్ని రాష్ట్రంలో సక్రమంగా అమలయ్యేలా చూడమంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి మొక్కారు. విద్యుత్‌, పెట్రోల్‌ చార్జీలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, వాటి వల్ల పేదల బతుకులు భారంగా మారాయని ఆయన తెలిపారు. పార్టీ మండ లాధ్యక్షుడు కోడ వెంకటరమణ, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పేకేటి హరికృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్‌, గాది వరహాల బాబు, శిలపరశెట్టి జగన్మోహన్‌, పోతుల విశ్వనాథం, కటకం ఈశ్వరరావు, వనపర్తి రాజా పాల్గొన్నారు.


పిఠాపురంలో నిరసన

పిఠాపురం: పట్టణంలోని 1,30వ వార్డుల్లో ట్రూఅప్‌ చార్జీల పేరిట విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, అందుగుల సత్తిబాబు, బోడపాటి సింహాచలం, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్‌, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, సోము సత్యనారాయణ, దుగ్గాడ విజయలక్ష్మి, జనపరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:14:24+05:30 IST