వైసీపీ ఎమ్మెల్యేలకు 26 ప్రశ్నలు వేయండి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2022-05-18T00:25:14+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు వైఎస్సార్ ప్రభుత్వంపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శలు, ప్రశ్నలు సంధించారు....

వైసీపీ ఎమ్మెల్యేలకు 26 ప్రశ్నలు వేయండి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు వైఎస్సార్ ప్రభుత్వం కార్యక్రమంపై  టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శలు, ప్రశ్నలు సంధించారు. గడపగడపకు వైయస్సార్ ప్రభుత్వం అని వచ్చే నాయకులకు ఆయన 26 ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలు మేధావులు, సామాన్య ప్రజలు సందిస్తున్నారని.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్ల వద్దకు వస్తున్న ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలను ప్రజలు కూడా  ఈ ప్రశ్నలు వేయాలని, ఇచ్చిన హామీలపై నిలదీయాలని  శ్యామ్ చంద్ర శేషు పిలుపు నిచ్చారు.  ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్’...‘బాబు రావాలి బాదుడు పోవాలి.’ అని  డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. 


1.ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ?


2.మద్యపాన నిషేధం ఎక్కడ? నాసిరకం మద్యం ఎందుకు అమ్ముతున్నారు?

కేవలం నగదు రూపములో మాత్రమే ఎందుకు అమ్మకాలు సాగిస్తున్నారు?


3. ప్రత్యేకహోదాఎక్కడ ?


4. ఇసుకధరలు ఎందుకు పెంచారు?


5.పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ?


6.గుంతల రోడ్లపరిస్థితిఏంటి? 


7.కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ?


8.కొత్త పరిశ్రమలు ఎక్కడ?


9.ప్రతి సంవత్సరం జనవరి లో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడా?


10.కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ?


11. CPS రద్దు పరిస్థితి ఏంటి?


12.కార్పొరేషన్ లోన్స్ ఎందుకు ఇవ్వటంలేదు ?


13. పేదల ఇంటి బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు?


14.కరెంట్ కోతలుఎందుకు? కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు ?


15. ఆర్టీసీ (RTC) ఛార్జీలు ఎందుకు పెంచారు!


16.నిత్య అవసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ధరలు అదుపు చేయలేక పోయారు?


17.పెట్రోలు, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలు ఎందుకు విపరీతంగా పెంచారు?


18. పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు మూసివేశారు?


19. నిరుద్యోగ భృతి ఎందుకు నిలిపివేశారు ?


20. పేదల కోసం ఇచ్చే  పెళ్ళికానుక ఎందుకు ఆపారు?


21.NSFDC లోన్స్ ఎందుకు ఆపారు?


22. చంద్రన్న భీమా లేదా  వైఎస్సార్ భీమా ఎక్కడా?


23. రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?


24.SC,ST మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?


25. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా ఎందుకు చేయబోతున్నారు?


26. అభయ హస్తం డబ్బులు ఎక్కడ?


Updated Date - 2022-05-18T00:25:14+05:30 IST