Abn logo
Aug 12 2020 @ 12:27PM

విశాఖలో ప్రధాని ఎలా శంకుస్థాపన చేస్తారు?

కరోనా బాధితులను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు 

టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు 


కర్నూలు(ఆంధ్రప్రదేశ్): గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  అమరావతిలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఇప్పుడు జగన్‌ అనాలోచిత నిర్ణయంతో విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే మళ్లీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలా హాజరవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా   మూడు రాజధానుల   నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని విజ్ఞప్తి చేశారు.


అప్పట్లో అమరావతి శం కుస్థాపనలో పాల్గొన్న మోదీ  ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుందని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేపట్టిన విశాఖ రాజధాని శంకుస్థాప నకు మోదీ హాజరు కాకూడదని అన్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రైవేటు ఆసుపత్రుల యజమానులకు కనకవర్షం కురిపిస్తోందని సోమిశెట్టి ఆరోపించారు. విజయవాడ  స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో మృతుల కుటుంబాలను, బాధితులను సీఎం పరామర్శించకపోవడం  దారుణమన్నారు.  


Advertisement
Advertisement
Advertisement