దాడులపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-20T06:26:28+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి నివాసంతోపాటు పార్టీ కేంద్ర కార్యాలయం, రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

దాడులపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు..

ఆందోళనలు, నిరసనలు, సీఎం దిష్టిబొమ్మల దహనంతో అట్టుడికిన అనంత

నేటి బంద్‌కు అన్నివర్గాలు 

సహకరించాలని నేతల విజ్ఞప్తి

అనంతపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి నివాసంతోపాటు పార్టీ కేంద్ర కార్యాలయం, రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడులను ని రసిస్తూ... జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ శ్రేణుల ఆందోళనలతో జిల్లా అట్టుడికిపోయిం ది. టీడీపీ శ్రేణుల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు సీఎం దిష్టిబొమ్మల దహనాలను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలను అడ్డుకోవడంలో భాగంగా టీడీపీ శ్రేణులను అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలో చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకా్‌షనాయుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్‌ మురళీధర్‌, రైతు సంఘం రాష్ట్ర నేత రాయల్‌ మురళి, టీఎనఎ్‌సఎ్‌ఫ అ నంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గుత్తా ధనుంజయనాయుడు తదితరులు టవర్‌క్లాక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పో లీసులు జోక్యం చేసుకుని, ఆందోళనకారులను అరెస్టు చేశారు. యాడికి మం డలం రాయలచెరువులో స్థానిక నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక పోలీసులు.. ఆందోళనను అడ్డుకునే ప్రయత్నంలో ఓ కార్యకర్త చొక్కా చింపేశారు. గుత్తిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకున్నారు. కదిరిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తలుపులలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలోని టి సర్కిల్‌లో ఆ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నా యకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగింది. ప్రభుత్వం సాగిస్తున్న వ్యతిరేక విధానాలను తూ ర్పారబట్టారు. ఇలా అనేక ప్రాంతాల్లో దాడులను ఖండిస్తూ... టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశాయి.


నేటి బంద్‌కు అన్నివర్గాలు సహకరించాలి

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైసీపీ దాడులను ఖం డిస్తూ బుధవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జిల్లాలో అన్నివర్గాల ప్రజలు సహకరించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. బంద్‌ లో వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.



Updated Date - 2021-10-20T06:26:28+05:30 IST