మీ నేతల భాషేంటి?: సీఎం జగన్‌కు వర్ల రామయ్య ప్రశ్న

ABN , First Publish Date - 2020-08-06T22:58:51+05:30 IST

వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు

మీ నేతల భాషేంటి?: సీఎం జగన్‌కు వర్ల రామయ్య ప్రశ్న

అమరావతి: వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారూ! కొంత మంది మీ మంత్రుల భాష, నాయకుల వ్యాఖ్యలు, చివరకు నిన్న మీ పండుల రవీంద్ర మతి లేని మాటలు మీ నాయకత్వ లక్షణాన్ని వెక్కిరిస్తున్నవి. మీ ఎమ్మెల్సీ పండుల వ్యాఖ్య "బురదలో పొర్లాడు వరహాన్ని" పోలి ఉన్నది. వారి నాయకుడిగా సమాజానికి మీరు క్షమాపణ చెబుతారా లేక వారే చెబుతారా?.’ అని సీఎం జగన్‌ను వర్ల రామయ్య నిలదీశారు.



Updated Date - 2020-08-06T22:58:51+05:30 IST