మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

మదనపల్లెలో బుధవారం జరిగిన టీడీపీ మినీ మహానాడుకు పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె, పీలేరు, కలి కిరి మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు.

మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు
కలికిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి కిశోర్‌కుమార్‌రెడ్డి ర్యాలీ

 కలికిరి నుంచి 40 కి.మీ. స్కూటీ మీద వెళ్లిన కిశోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి, జూలై 6: మదనపల్లెలో బుధవారం జరిగిన టీడీపీ మినీ మహానాడుకు పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె, పీలేరు, కలి కిరి మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి  కలికిరి నుంచి మదనపల్లె వరకూ 40 కిలోమీటర్ల దూరం ర్యాలీగా పసుపు రంగు స్కూటీ నడుపుకుంటూ వెళ్లారు.  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్‌, మాజీ ఇన్‌చార్జీ రవిప్రకాష్‌, జిల్లా కార్యనిర్వాహ కార్యదర్శి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కేవీపల్లె, కలికిరి, పీలేరు మండల టీడీపీ అధ్యక్షులు గీతాంజలి, నిజాముద్దీన్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రాజంపేట పార్లమెంటు ఉపా ద్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్‌ తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.  

పీలేరులో: మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి పీలేరు ఇన్‌ఛార్జ్‌ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి జనసమీకర ణపై ప్రత్యేక దృష్టి సారించారు. మదనపల్లెకు పొరుగున ఉన్న నియోజకవర్గం కావడంతో పీలేరు నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులను సమాయాత్తపరిచారు.  పీలేరు నుంచి తరలి వెళ్లిన వారిలో నేతలు కోటపల్లె బాబు, వారణాశి శ్రీకాంత్‌ రెడ్డి, మల్లెల రెడ్డిబాషా, అమరనాథ్‌ రెడ్డి, పురం రామ్మూర్తి, యల్లెల రెడ్డప్పరెడ్డి, లడ్డూ జాఫర్‌, పోలిశెట్టి సురేంద్ర, లక్ష్మీకర, కంచి సూరి, రియాజ్‌, సుభ ద్రమ్మ, రమాదేవి, సోనాబాయి, షౌకత్‌ అలీ, స్పోర్ట్స్‌ మల్లి, రెడ్డిముని, మౌలా, నాగేంద్ర, ఖాజా, బర్కూ, బుజ్జు, ఉన్నారు. 

బి.కొత్తకోటలో : మినీ మహానాడు సభకు బి.కొత్తకోట మండలం నుంచి  తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు. పార్టీ ఇన్‌చార్జ్‌ శం కర్‌ యాదవ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌, తంబళ్లపల్లె నేత మద్ది రెడ్డి కొండ్రెడ్డిల ఆధ్వర్యంలో వారి వారి వర్గీయులు వేర్వేరుగా వెళ్లారు. 

పెద్దతిప్పసముద్రంలో: మినీ మహానాడుకు పీటీఎం మండలం నుంచి అధిక సంఖ్యలో  టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున బయలు దేరి వెళ్లారు. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలి వెళ్లారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌ శంకర్‌యాదవ్‌, పార్టీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి వేర్వేరుగా వాహనాలు సమకూర్చ డంతో  అధిక సంఖ్యలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. 

గుర్రంకొండలో: మినీ మహానాడుకు గుర్రంకొండ టీడీపీ నాయకులు బైకులు, కార్లలో వందలాదిగా బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు హరిప్రసాద్‌ నాయుడు, జగదీష్‌, నౌషాద్‌ అహ్మద్‌, రెడ్డిప్రసాద్‌నాయుడు, ఎజాజ్‌ అహ్మద్‌, క్రాం తికుమార్‌, ఇక్బాల్‌ ఖాసీం, ఎల్లుట్ల మురళీ, చలమారెడ్డి, చంద్రబాబు, నాగేం ద్ర, ఆనంద్‌, నారా.వెంకటర మణ, సుధాకర్‌, ప్రదీప్‌, ఉమాశంకర్‌, శివకుమార్‌, సాగర్‌, ధ్వారక, ప్రకాశ్‌, నాగరాజ, రమణలు వెళ్లారు.

కలకడలో:మినీ మహానాడుకు కలకడ మండలం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సభ విజయవంతానికి వర్షాని సైతం లెక్క చేయకుండా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ వాహనాలతో సభకు చేరుకొన్నారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి ప్రభాకర్‌నాయు డు, రాజంపేట పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దగ్గుబాటి వెంకటే శ్వరరావు, బరకం శ్రీనివాసులరెడ్డిలు వెళ్లారు.

కురబలకోటలో: టీడీపీ మినీ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్య లో తరలివెళ్లారు. అంగళ్ళులో రాజంపేట పార్లమెంటరీ బీసీసెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో అంగళ్ళు నుంచి మాజీ సీఎం చంద్రబాబునాయు డికి స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున బైక్‌ ర్యాలీని నిర్వహించారు.  కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటర మణారెడ్డి,  నాయకులు అయూబ్‌ బాషా, రుద్రబాల కృష్ణ, వెంకటరెడ్డి, నరసింహులు, మోహన్‌రెడ్డి,శ్రీనివాసులు, నవీన్‌కుమార్‌రె డ్డి తదితరులు పాల్గొన్నారు. 

ములకలచెరువులో: మినీ మహానాడుకు తంబళ్లపల్లె నియోజక వర్గం నుంచి ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల నుంచి రెండు వేలకుపైగా వాహనాల్లో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు మహానాడుకు బయలుదేరి వెళ్ళారు. తంబళ్ళపల్లె ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్‌, రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌,  నేత కొండ్రెడ్డిల అధ్వర్యంలో భారీ గా తరలివెళ్ళారు. 

నిమ్మనపల్లెలో: మినీ మహానాడుకు బుధవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమే్‌శ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. మండల ప్రజలు ద్విచక్రవాహనాలలో టీడీపీ జెండాలు కట్టుకొని ర్యాలీగా బయ లుదేరి వెళ్లారు.  దాదాపు 5వేల మందికి పైగా మహానాడుకు బయలు దేరినట్లు తెలుస్తోంది. దీంతో పండుగ వాతావరణం నెలకొంది.



Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST