వైసీపీ వైఖరిపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-21T06:37:54+05:30 IST

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైసీపీ మూకల దాడులకు నిరసనగా అధిష్టాం పిలుపు మేరకు బుధవారం నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది.

వైసీపీ వైఖరిపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

    నాలుగు మండలాల్లో బంద్‌ ప్రశాంతం 

 పార్టీ కార్యాలయాలపై దాడులను ఖండించిన తమ్ముళ్లు

పాయకరావుపేట, అక్టోబరు 20 : రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైసీపీ మూకల దాడులకు నిరసనగా అధిష్టాం పిలుపు మేరకు బుధవారం నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పాయ కరావుపేట మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యక ర్తలు స్థానిక వై.జం క్షన్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం పట్ట ణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మం గవరంరోడ్డు జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమవైఖరి మార్చుకోకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబు తారన్నారు.  పట్టణ పార్టీ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను, నాయకులు యాళ్ళ వరహాలబాబు, వంకా వెంకటరమణ, బొంది కాశీవిశ్వనాథం, కంకిపాటి వెం కటేశ్వరరావు, నాగం బుల్లిదొర, చింత కాయల రాంబాబు, దాసరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి : మండల కేంద్రం నక్కపల్లిలో టీడీపీ నాయకులు బంద్‌ పాటించారు. పలు గ్రామాల నుంచి టీడీపీ నాయకులు నక్కపల్లి చేరుకున్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పలు దుకాణాలను మూసివేయించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని టీడీపీ నాయకులు ఉపాధ్యాయులను కోరుతుండగా, పోలీసులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడికి పాల్పడడం అమంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమేనని వారన్నారు. ఈ మేరకు ముందస్తుగా టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ వైబోయిన రమణ, కొప్పిశెట్టి బుజ్జి, కేవీ సత్యనారాయణ, దార్ల కృష్ణ, నానేపల్లి రాఘవులు, తాతారావు తదితరులను అరెస్ట్‌ చేసి పూచీకత్తుపై విడుదల చేశారు. 

ఎస్‌.రాయవరం : మండలంలోని అడ్డరోడ్డు-తిమ్మాపురంలో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీపీ ఏజర్ల వినోద్‌రాజు, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు నల్లపరాజు వెంకట్రాజు ఆధ్వర్యంలో బంద్‌ పాటించారు. పలు బ్యాంకులు, పాఠశాలలను మూసివేయించారు. టీడీపీ జెండాలను చేతబట్టి, వైసీపీ విధ్వంసకాండ నశించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా వినోద్‌రాజు, వెంకట్రాజు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ పాలకులు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఇటువంటి నీచ సంస్కృతికి తెరతీసిన వైసీపీ పాలకులకు త్వరలోనే ప్రజలు బుద్ధిచె పుతారన్నారు. పార్టీ నాయకులు తన్నీరు ఎరకయ్య, గుర్రం రామకృష్ణ, అల్లు నర్సింహమూర్తి, వంగలపూడి గోవింద్‌,; గోరింట్ల ఆషా తదితరులు పాల్గొన్నారు.

కోటవురట్ల : మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యం నిశించాలంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జెండాలు పట్టు కుని ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి  మూసివేయించారు. షాపులు, దుకాణాలు, వాణిజ్య సంస్థలను కూడా మూయించారు. అనంతరం  కోటవురట్ల జంక్షన్‌లో టీడీపీ నాయకులు జానకి శ్రీనిసరావు, వేచలపు జనార్థన్‌లు  మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తున్నారని మండి పడ్డారు.  ఈ కార్యక్రమాల్లో ఎంపీటీసీ పీవీ సూర్యరావు, కొడవటిపూడి ఎంపీటీసీ యలమంచలి ప్రకాశ్‌, పినపాత్రుని గురయ్యదొర, బీకేపల్లి సర్పంచ్‌ లింగం నాయుడు, టీడీపీ నేతలు వేచలపు భాస్కరరావు, సుంకర్‌ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:37:54+05:30 IST