ఒక్క చాన్స్‌ అంటూ సర్వనాశనం చేశారు

ABN , First Publish Date - 2022-05-18T05:46:13+05:30 IST

సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలన తుగ్లక్‌ పాల నగా కొనసాగుతుందని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ విమర్శించారు.

ఒక్క చాన్స్‌ అంటూ సర్వనాశనం చేశారు
బి.సింగవరంలో ప్రదర్శన చేస్తున్న టీడీపీ శ్రేణులు

ధరలపై టీడీపీ ఆధ్వర్యంలో  నిరసన

జంగారెడ్డిగూడెం, మే 17 : సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలన తుగ్లక్‌ పాల నగా కొనసాగుతుందని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని 24వ వార్డు త్రివేణి సెంట ర్‌లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రావూరి కృష్ణ మాట్లాడుతూ ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ సామాన్యుల బతుకు భారంగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, కరెంటు కోతలు, చార్జీల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచారన్నారు. పట్టణ కార్యదర్శి తూటి కుంట రాము, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్‌కుమార్‌, ఏలూరు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, పగడం సౌభాగ్య వతి, పాతూరి అంబేద్కర్‌, గుళ్లపూడి శ్రీదేవి, అల్లూరి రామకృష్ణ, మందపల్లి లక్ష్మయ్య, నాగేశ్వరరావు, కిషోర్‌, ప్రమీల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అధిక ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు..

పెదవేగి, మే 17 : వైసీపీ అధికారం చేపట్టిన నాటినుంచి ధరలమోత మోగుతూనే ఉందని, అధికధరలతో వైసీపీ నాయకులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ అన్నారు. పెదవేగి మండలం బి.సింగవరంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. సుధాకర్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక్కఛాన్స్‌ అంటూ  అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, అధికారం చేపట్టిన నాటినుంచి ప్రజల సమస్యలను పక్కనబెట్టి తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారన్నారు.  గడచిన మూడేళ్ళుగా సామాన్యులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, ఇది ఇంకా కాలం సాగదన్నారు. టీడీపీ నాయకులు పరసా వీరాస్వామి, తాతా యశ్వంత్‌ రాజశేఖర్‌, దేవరపల్లి ఆదామ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T05:46:13+05:30 IST