అమరావతి: హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం అందజేసింది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చెయ్యక పోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు టీడీపీ సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి