AP News: తిరువూరులో నాలుగో రోజుకు టీడీపీ నిరసన దీక్ష

ABN , First Publish Date - 2022-09-29T17:25:36+05:30 IST

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తిరువూరు మైనార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నిరసన దీక్ష నాలుగవ రోజుకు చేరింది.

AP News: తిరువూరులో నాలుగో రోజుకు టీడీపీ నిరసన దీక్ష

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాని (NTR Health university)కి ఎన్టీఆర్ (NTR) పేరు తొలగించి వైఎస్ఆర్ (YSR) పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తిరువూరు మైనార్టీ ఆధ్వర్యంలో టీడీపీ (TDP) నిరసన దీక్ష నాలుగవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శావల దేవదత్ (Shavala devdat).. నిరసన చేస్తున్న వారికి పూలమాట వేసి దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం దేవదత్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్టీరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని,  పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఆయన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యంగా వైద్య విద్యా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన మహానేత ఎన్టీ రామారావు అని కొనియాడారు. ప్రైవేటు వైద్య కళాశాలలు అన్నీ ఒక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని ఒక మహా సంకల్పంతో పని చేసి కార్యరూపంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భారత్ దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీ అని అన్నారు. అటువంటి మహానుభావుడి పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా దారుణమని దేవదత్ మండిపడ్డారు. 

Updated Date - 2022-09-29T17:25:36+05:30 IST