ఓటీఎస్‌పై తెలుగుతమ్ముళ్ల నిరసన

ABN , First Publish Date - 2021-12-07T05:04:41+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించారు.

ఓటీఎస్‌పై తెలుగుతమ్ముళ్ల నిరసన
అద్దంకిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

 ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 6 : ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించారు. సోమవారం ఒంగోలులోని హెచ్‌సీఎం కాలేజీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పేదల ఇళ్లపై ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కడితేనే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని, అందుకోసం అధికారులు, నాయకులు ఒత్తిడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.  వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. అంతకుముందు రాజ్యాంగ  నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, ఒంగోలు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి, తెలుగుయువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసులు, ఒంగోలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి బండారు మదన్‌, దాయనేని ధర్మ, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

 బలవంతపు వసూళ్లు ఆపాలి

 అద్దంకి: పేదలు ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు హక్కు కల్పిస్తామంటూ ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు వసూళ్లను వెంటనే నిలిపివేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటీఎస్‌కు డబ్బులు ఎవ్వరూ చెల్లించవద్దని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని లక్ష్మీశ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణచంద్రరావు, నాయకులు కరి పరమేష్‌, మానం మురళీమోహన్‌దా్‌స, మన్నం త్రిమూర్తులు, కఠారి నాగేశ్వరరావు, బండారుపల్లి శ్రీనివాసరావు, ఎర్రాకుల రామాంజనేయులు, జాగర్లమూడి జయకృష్ణ, చెన్నుపాటి హరిబాబు, మహిళా నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.

పర్చూరు: అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలో స్థానిక బొమ్మల సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)ను రద్దు చేయాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణా రావు, మానం హరిబాబు, ఎస్సీసెల్‌ నాయకులు బేదపూడి సురేష్‌, షేక్‌ సమీర్‌, షేక్‌ షంషుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

 చీరాలటౌన్‌: అంబేడ్క ర్‌ రచించిన రాజ్యాంగం వలన నేడు బడుగు బల హీన వర్గాల ప్రజలు మ నుగడ కొన సాగుతుం ద ని చీరాల టీ డీపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్‌  విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 1983 నుండి నిర్మించుకున్న నివాసాలకు నేడు రూ.10 వేలు చెల్లించాలని వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజలను భ యభ్రాంతులకు గురిచేయొద్దన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. కార్యక్రమంలో గుద్దంటి చంద్రమౌళి, నాశిక వీరభద్రయ్య, కౌతరపు జనా ర్దన్‌రావు, బొగ్గుల పార్ధసారధి, అందె ఉమా మహేశ్వరరావు, పులి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

మార్టూరు: మార్టూరులోని నేతాజీనగర్‌, రామ్‌నగర్‌ కూడలిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గృహరుణ విముక్తి పథకం కింద ఓటీ ఎస్‌ వసూళ్ళు చేయడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని  కో రుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో షేక్‌ రజాక్‌, కామేపల్లి హరిబాబు, శానంపూడి చిరంజీవి, కామి నేని జనార్ధన్‌, పోపూరి శ్రీను, షేక్‌ ఫారూక్‌ తదితరులు పాల్గొన్నారు. 

యద్దనపూడి మండలంలోని గన్నవరం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు నన్నపనేని రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-12-07T05:04:41+05:30 IST