రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-07-25T06:17:12+05:30 IST

వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదంటూ శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పుట్టపర్తిలో నిరసన చేపట్టాయి.

రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆగ్రహం

రోడ్లపై గుంతలు పూడుస్తూ నిరసనలు

పుట్టపర్తి, జులై 24: వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదంటూ శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పుట్టపర్తిలో నిరసన చేపట్టాయి. టీడీపీ కార్యాలయం నుంచి నినాదాలు చేసుకుంటూ బైపాస్‌ రోడ్డు మీదుగా ర్యాలీ సాగించాయి. దుర్గమ్మ గుడి వద్ద పూర్తిగా దెబ్బతిన్న రోడ్డుకు పల్లె స్వయంగా కంకర వేసి, గుంతలు పూడ్చారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం చేరుకొని మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితి గురించి కమిషనర్‌ శివరామిరెడ్డికి వివరించారు. నిధులున్నా రోడ్డు మీద గుంతలు ఎందుకు పూడ్చలేకపోయారంటూ ప్రశ్నించారు. పన్నులు వసూలు కాలేదని కమిషనర్‌ వివరించారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి.. సొంత నిధులతో రోడ్లు వేయిస్తాన’న్నారు. ఈ సందర్భంగా పల్లె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో రూ.15 కోట్లతో చిత్రావతిపై చెక్‌డ్యాం ని ర్మించామని పేదలకోసం ప్రత్యేకంగా టిడ్కో ఆధ్యర్యంలో గృహాలు నిర్మించామన్నారు. పింఛన్లు కూడా పేదలకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ మండిపడ్డారు. గ్యాస్‌, డీజల్‌, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి ప న్నులు, చెత్తపన్ను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం లో నేతలు అంబికా లక్ష్మీనారాయణ, రత్నప్పచౌదరి విజయ్‌కుమార్‌ శ్రీరాంరెడ్డి గూ డూరు ఓబులేసు, గోపాల్‌రెడ్డి, సాలక్కగారి శ్రీనివాసులు, శంకర, మల్లిరెడ్డి, జయచంద్ర, రామకృష్ణ, కొత్తపల్లి జయప్రకాష్‌ సామకోటి ఆది, సాలక్కగారి శ్రీనివాసులు, గంగాధర్‌, అంబులెన్సు రమేష్‌, రాజారెడి,్డ నాగిరెడ్డి, లావణ్య, రాధ, మాధవి, నాగమణి, ప్రభాకర్‌ రెడ్డి, అశ్వక్‌ఖాన, మనోహర్‌, రాజప్ప, మహేష్‌, వక్కలం శ్రీనివాసులు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. 

బ్రహ్మసముద్రం: మండలంలోని సంతేకొండాపురం నుంచి మామిడూరు వరకు రోడ్లుపై నిరసన చేపట్టారు. నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు పాల్గొన్నారు. రోడ్డుపై పెద్దఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా గ్రామీణరోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో రోడ్లు ప్రయాణానికి పనికిరాకుండా ప్రమాదాలకు నిలయాలుగా మారాయన్నారు. అనంతరం రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ శ్రీరాములు, నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, రామరాజు, తలారి సత్యప్ప, సర్పంచ వనిత, మాజీ సర్పంచలు రామచంద్ర, మాజీ ఎంపీటీసీ నారాయణ, మండల రైతు సంఘం మాజీ అధ్యక్షుడు ఓబులేష్‌, నల్లమల, మల్లి, కేశవరెడ్డి, నగేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T06:17:12+05:30 IST