రైతు, చేనేతల వెన్ను విరిచిన జగన

ABN , First Publish Date - 2022-07-05T05:52:03+05:30 IST

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన జగనరెడ్డి రైతు, చేనేతల వెన్నువిరిచారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.

రైతు, చేనేతల వెన్ను విరిచిన జగన

మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజం

అన్నదాతలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్‌

ముఖ్యమంత్రికి పరిటాల శ్రీరామ్‌ హెచ్చరిక

ధర్మవరం, జూలై 4: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన జగనరెడ్డి రైతు, చేనేతల వెన్నువిరిచారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. రైతు, చేనేతలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్‌ అంటూ ముుఖ్యమంత్రిపై టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు. వారి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో రైతు, చేనేతల పోరు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజ్‌ సర్కిల్‌ వద్ద పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. పరిటాల సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలన్నీ వైసీపీ కార్యకర్తలు, నాయకులకే చేరుతున్నాయనీ, నిజమైన రైతు, చేనేతలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. పంటల బీమాలో రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ధర్మవరంలో అత్యధికంగా ఉన్న చేనేతలకు అందాల్సిన పథకాలన్నీ అటకెక్కించి, రూ.24వేలు అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నారన్నారు. ఈ పథకం వైసీపీ నాయకులు, కార్యకర్తలకే వర్తింపజేస్తున్నారన్నారు. ట్రాన్సకో అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాడిమర్రి మండలంలో ఐదుగురు సజీవ దహనమయ్యారనీ, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బటన నొక్కుడు అంతా ఉత్తిదేనని ఎద్దేవా చేశారు. కొందరు రైతులకు రూ.100లోపు పంటల బీమా మంజూరైందనీ, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. రైతులు, చేనేతలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమనీ, ఖబడ్దార్‌ అంటూ ముఖ్యమంత్రిని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ వరప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, కుణుతూరు వేణుగోపాల్‌ రెడ్డి, పురుషోత్తంగౌడ్‌, చింతలపల్లి మహేశచౌదరి, ముత్యాలప్ప నాయుడు, మేకల రామాంజనేయులు, పోతుకుంట లక్ష్మన్న, గొట్లూరు శీనా, భీమనేని ప్రసాద్‌నాయుడు, రంగయ్య, ముత్యాల్‌రెడ్డి పాల్గొన్నారు.


అసమర్థ పాలనను అంతమొందించాలి

బీకే పార్థసారథి పిలుపు.. కొండాపురంలో బాదుడే బాదుడు

గోరంట్ల, జూలై 4: ప్రజలపై మోయలేని భారం మోపుతున్న అసమర్థ పాలనను అంతమొందించాలని టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. మండలంలోని కొండాపురం గ్రామంలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెంచిన విద్యుత, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కొవ్వొత్తులు వెలిగించి, గ్రామంలో నిర సన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ.. విద్యుత చార్జీలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల మెడకు ఉరి బిగించుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతుల్లో వ్యవసాయంపై విరక్తి కలిగించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు కొత్తపల్లి నరసింహులు, బెల్లాలచెరువు చంద్ర, నీలకంఠారెడ్డి, వెంకటరంగారెడ్డి, రామచంద్రారెడ్డి, గిరిధర్‌గౌడ్‌, అజ్మతుల్లా, నరే్‌షయాదవ్‌, నరసింహారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T05:52:03+05:30 IST