పెట్రో బాదుడుపై భగ్గుమన్న టీడీపీ

ABN , First Publish Date - 2021-07-27T06:43:58+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల బాదుడుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. వీటి ధరలు రోజురోజుకు పెరగటంపై టీడీపీ ఆందోళనకు దిగింది. పార్టీ పిలుపు మేరకు టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటే్‌షగౌడ్‌ నేతృత్వంలో సోమవారం జిల్లా కేంద్రంలో వినూత్న ఆందోళన చేపట్టారు.

పెట్రో బాదుడుపై భగ్గుమన్న టీడీపీ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన

ధరలు తగ్గించేవరకు పోరాడతామన్న కాలవ


అనంతపురం వైద్యం, జూలై26

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల బాదుడుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. వీటి ధరలు రోజురోజుకు పెరగటంపై టీడీపీ ఆందోళనకు దిగింది. పార్టీ పిలుపు మేరకు టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటే్‌షగౌడ్‌ నేతృత్వంలో సోమవారం జిల్లా కేంద్రంలో వినూత్న ఆందోళన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ, మరో వైపు మోటార్‌ బైక్‌కు పాడెగట్టి భుజాలపై ఊరేగిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి, అనంతపురం  పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఉన్నాయన్నారు. వీటి ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు తగ్గించాలని ప్రతిపక్షంలో ఉన్న జగన పార్టీ గగ్గోలు పెట్టిందన్నారు. ఆ రోజు రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా ఏడాదికి రూ.1160 కోట్లు నష్టం వస్తుందని తెలిసినా ప్రజల కోసం లీటర్‌కు రెండు రూపాయలు తగ్గించినట్టు తెలిపారు. మనం చెల్లించే రూ. 100లో 60 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయన్నారు. ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం సాగిస్తుందని కాలవ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళీ, టీఎనటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం నాగభూషణం, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, టీడీపీ నాయకులు సరిపూటి రమణ, నారాయణ స్వామియాదవ్‌, లాయర్‌ శ్రీధర్‌, బంగి నాగ, పూల బాషా, నరసింహులు, బొమ్మినేని శివా, వెంకటకృష్ణ, దూదేకుల రఫీ, సుంకన్న, రాయల కొండయ్య, రాంబాబు, గోపాల్‌ గౌడ్‌, శ్రీవర్దన, గంగవరం బుజ్జి, రవికుమార్‌గౌడ్‌, రఫిక్‌, నాగరాజు, కృష్ణమూర్తి, ఆదెప్ప, పోలన్న, రామాంజనేయు లు, రజాక్‌, మురళీ, తెలుగు మహిళలు విజయశ్రీ, జానకీ, రాములమ్మ, లక్ష్మిదేవి, మంజులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:43:58+05:30 IST