టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఈసారి ముగ్గురు

ABN , First Publish Date - 2020-10-20T06:56:39+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరోలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. ఇప్పటివరకూ ఇద్దరు ఉండేవారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చాలాకాలం నుంచి

టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఈసారి ముగ్గురు

యనమల, రాజప్పకు మరోసారి గౌరవం
కొత్తగా గోరంట్లకు అవకాశం
 తెలుగుదేశంలో నూతనోత్సాహం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరోలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. ఇప్పటివరకూ ఇద్దరు ఉండేవారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చాలాకాలం నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉంటూ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మళ్లీ ఆయనకు పొలిట్‌బ్యూరోలో గౌరవం లభించింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దాపురం నుంచి గెలిచిన నిమ్మకాయల చినరాజప్పకు, ఉపముఖ్యమంత్రి పదవితోపాటు పొలిట్‌బ్యూరోలో కూడా స్థానం లభించింది. ఆయనకు మళ్లీ పదవి లభించింది. మరో సీనియర్‌ నేత,  మాజీమంత్రి, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి తొలిసారిగా పొలిట్‌ బ్యూరోలో అవకాశం లభించింది. ఈనేపథ్యంలో  తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి జిల్లా ఎప్పుడూ పెట్టనికోటగా ఉండేది. 19 స్థానాలు ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుతం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులో చినరాజప్ప, గోరంట్ల, ఆదిరెడ్డి భవాని ఉన్నారు. ముగ్గ్గురిలో ఇద్దరికి పొలిట్‌బ్యూరోలో చోటు లభించింది. సంస్థాగత ఎన్ని కల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. జిల్లాలోని గ్రామ, మండల, పట్టణ, నగర కమిటీల్లో ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్‌టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల నియమించిన  పార్లమెంటరీ జిల్లా కమిటీలో కూడా కాపు, బీసీ, ఎస్సీలకు  గౌరవ స్థానం ఇచ్చింది. ఇంకా జిల్లా కమిటీ పూర్తి నియమించవలసి ఉంది. జిల్లా కమిటీతోపాటు, అనుబంధ కమిటీలు కూడా ఉంటాయి. వాటిలో కూడా అన్నివర్గాలకు ప్రాధాన్యం లభించేలా పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రస్థాయి కమిటీలో కూడా జిల్లాకు ప్రాధాన్యం లభించనున్నది. రాష్ట్ర స్థాయి కమిటీల్లో ముఖ్య పదవుల కోసం జిల్లా నుంచి గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,  బీసీ వర్గాల నుంచి నాగిడి నాగేశ్వరరావు, పెచ్చెట్టి చంద్రమౌళి, ఇతర వర్గాల నుంచి సూరిబాబు రాజు వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈసారి పార్టీ అఽధి ష్ఠానం పాతవారితోపాటు కొత్తవారికి, ఉత్సాహవంతులకు, కమిట్‌మెంట్‌ ఉన్నవారికి స్థానం కల్పిస్తోంది. గ్రామాల నుంచి జిల్లా వరకూ ఎంతోమంది పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలన్నింటిలో ఇటువంటి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇంతవరకూ చాలామంది సరైన గుర్తింపు రాలేదనే బాధ కూడా ఉంది. అయినా వారు కాసేపు బాధపడి పార్టీ కోసం పనిచేస్తుంటారు. అటువంటివారితోపాటు ఇటీవల అన్ని వర్గాలు చైతన్యవంతం కావడం వల్ల ఆయా వర్గాల నుంచి కూడా రాజకీయ గుర్తింపు కోరుతున్నారు. తమకు సరైన ప్రాధాన్యం లభిస్తుందని ఆయా వర్గాల నుంచి ఎదురుచూస్తున్నారు.
పూర్వవైభవం తీసుకొస్తాం : గోరంట్ల
నేను ఎప్పుడూ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నా. పొలిట్‌బ్యూరోలో అవకాశం లభించడం సంతోషంగా ఉంది. చంద్రబాబు,లోకేష్‌, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వివిధ పదవుల్లో పనిచేశాను. మరింత ఉత్సాహంగా అందరం కలసి పార్టీకి పూర్వవైభవం తీసుకొ స్తామని రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తెలిపారు.

Updated Date - 2020-10-20T06:56:39+05:30 IST