TDP పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు

ABN , First Publish Date - 2021-12-17T13:28:10+05:30 IST

: టీడీపీ చేపట్టిన టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

TDP పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు

ఏలూరు: టీడీపీ చేపట్టిన టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నేడు పోలవరం నిర్వాసితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పాలకొల్లు, కొమ్ముచిక్కాల, భీమడోలు, ఏలూరులో టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఏలూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడేటి చంటిని హౌస్ అరెస్ట్ చేశారు. 


Updated Date - 2021-12-17T13:28:10+05:30 IST