‘రాజ్యాంగానికి రక్షణ కావాలి’

ABN , First Publish Date - 2021-01-27T06:25:53+05:30 IST

సామర్లకోట, జనవరి 26: రాష్ట్రంలో రాజ్యాంగం తరచూ పరిహాసం, ధిక్కారానికి గురికావడం బాధాకరమని.. ఈ దశలో రాజ్యాంగానికి రక్షణ కావాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోటలో మంగళవారం జాతీయ పతా కాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ రా జ్యాంగం ద్వారా ఏర్పడిన స్వేచ్ఛహక్కులు రాష్ట్రంలో పూర్తిగా హరిస్తున్నా

‘రాజ్యాంగానికి రక్షణ కావాలి’

సామర్లకోట, జనవరి 26: రాష్ట్రంలో రాజ్యాంగం తరచూ పరిహాసం, ధిక్కారానికి గురికావడం బాధాకరమని.. ఈ దశలో రాజ్యాంగానికి రక్షణ కావాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోటలో మంగళవారం జాతీయ పతా కాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ రా జ్యాంగం ద్వారా ఏర్పడిన స్వేచ్ఛహక్కులు రాష్ట్రంలో  పూర్తిగా హరిస్తున్నాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో మనమందరం రాష్ట్రంలో రాజాంగ రక్షణకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా అంబేడ్కర్‌ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్రప్రసాద్‌, కంటే జగదీష్‌ మోహన్‌, డాక్టర్‌ జి.చిన్నయ్యదొర, బి.శ్రీకాంత్‌, జార్జి చక్రవర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:25:53+05:30 IST