ఓటీఎస్‌ రద్దుకై ‘పశ్చిమ’లో టీడీపీ భారీ ధర్నా

ABN , First Publish Date - 2021-12-28T00:03:39+05:30 IST

జగనన్న పైసా వసూల్‌ పథకమే ప్రభుత్వం తలపెట్టిన ఓటీఎస్‌ పథకమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.

ఓటీఎస్‌ రద్దుకై ‘పశ్చిమ’లో టీడీపీ భారీ ధర్నా

ఏలూరు: జగనన్న పైసా వసూల్‌ పథకమే ప్రభుత్వం తలపెట్టిన ఓటీఎస్‌ పథకమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాకు విశేష స్పందన లభించింది. ధర్నాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓటీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని, రుణాలు రద్దు చేసి ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఓటీఎస్‌ పథకం జగనన్న పైసా వసూల్‌ పథకమని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావన్నారు. న్యాయస్థానాల్లో ఇవి చెల్లనివిగా మిగులుతాయని, డబ్బు కట్టిన వారి పరిస్థితి ఏంటని రామానాయుడు నిలదీశారు. అనంతరం టీడీపీ నేతలు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించేందుకు వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. 


Updated Date - 2021-12-28T00:03:39+05:30 IST