జనసేనపై టీడీపీది వన్‌సైడ్ లవ్: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-07T02:30:45+05:30 IST

కుప్పం నియోజకవర్గంలో కొంత నిద్రాణంగా, మరికొంత నిస్తేజంగా, ఇంకొంత స్తబ్దుగా ఉన్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు జాగృతం చేస్తున్నారు.

జనసేనపై టీడీపీది వన్‌సైడ్ లవ్: చంద్రబాబు

కుప్పం: కుప్పం నియోజకవర్గంలో కొంత నిద్రాణంగా, మరికొంత నిస్తేజంగా, ఇంకొంత స్తబ్దుగా ఉన్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు జాగృతం చేస్తున్నారు. పార్టీకి నూతన జవసత్వాలు తేవడమే లక్ష్యంగా ఆయన కుప్పంలో అడుగుపెట్టారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో అన్ని స్థాయుల్లోనూ నాయకత్వానికీ, కార్యకర్తలకూ నడుమ అంతరం పెరిగిపోయింది. అదే సమయంలో పార్టీ నాయకత్వం కొంతమేరకు ప్రజలకు కూడా దూరమైంది. ఇదే విషయంపై గతంలో చంద్రబాబుకు అనేక పర్యాయాలు శ్రేణులు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, కుప్పంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నారు.


కుప్పం పర్యటన ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతోంది. మొదటి రోజు పర్యటనలో అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామకుప్పం మండలం వీరనమల తండాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని సూచించారు. ఈ సూచనలకు ఆయన చాల చమత్కారంగా సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రేమించుకుంటేనే అది పెళ్లి వరకు వెళుతుందని, ప్రస్తుతం టీడీపీ, జనసేనది వన్ సైడ్ లవ్ అని, పనికి రాదు కదా అని చమత్కార వ్యాఖ్యలు చేశారు. ‘మనం జనసేనను ప్రేమిస్తున్నాం .జనసేన కూడా కలిసి రావాలి్’ కదా అంటూ కార్యకర్త అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు.

Updated Date - 2022-01-07T02:30:45+05:30 IST