అప్పుల కోసం ప్రజలపై భారం వేస్తారా?

ABN , First Publish Date - 2020-12-06T05:21:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజలపై భారం వేస్తారా? బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు.. సామాన్య జనంపై పన్నుల రూపంలో భారం మోపుతారా అంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ప్రశ్నించారు.

అప్పుల కోసం ప్రజలపై భారం వేస్తారా?
నిరసన దీక్షలో టీడీపీ నాయకులు

బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు

సామాన్య జనంపై పన్నులా?

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కడప, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజలపై భారం వేస్తారా? బడా కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు.. సామాన్య జనంపై పన్నుల రూపంలో భారం మోపుతారా అంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ప్రశ్నించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను పెంపును నిరసిస్తూ టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎంలింగారెడ్డి, కడప ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు జిలానీబాషా, మాసా కోదండరామ్‌, శివ, నిర్మల,. మీనాక్షిలు 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి, అయితే నిధుల్లో కోతబెట్టి పన్నులు పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిజిస్ర్టేషన్‌ ఆధారంగా 15 శాతం మేర పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు. అలాగే నీటి పన్ను పెంచడం, వాణిజ్య సంస్థలు, అపార్ట్‌మెంట్లకు మీటర్లు పెట్టడం అన్యాయమన్నారు. పట్టణాల్లో పౌర సేవల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసే కుట్రలు దాగి ఉందన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లకు పాలకవర్గాలు లేని సమయంలో ప్రభుత్వాలు కూడబలుక్కుని స్థానిక సంస్థల పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధనరెడ్డి, వికా్‌స హరిక్రిష్ణ, గురప్ప, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, శివ, రాంప్రసాద్‌, తుమ్మల వెంకట కొండారెడ్డి, వెంకటరమణ దీక్షకు సంఘీభావం తెలిపారు. 12 గంటలపాటు చేపట్టిన దీక్షను రాత్రి 8 గంటలకు ఓఆర్‌ఎస్‌ ఇచ్చి విరమింపజేశారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఫోను చేసి లింగారెడ్డి, అమీర్‌బాబులకు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:21:52+05:30 IST