వైసీపీ విధ్వంస చర్యలకు పాల్పడుతోంది

ABN , First Publish Date - 2020-10-31T04:25:56+05:30 IST

అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే వైసీపీ పెయిడ్‌ ఆర్టిస్టులకు రంగంలోకి దించి విధ్వంసక చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విమర్శించారు.

వైసీపీ విధ్వంస చర్యలకు పాల్పడుతోంది
నరసాపురంలో చేతికి సంకెళ్లతో మాజీ ఎమ్మెల్యే బండారు, నేతల నిరసన

నరసాపురం టౌన్‌, అక్టోబరు 30: అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే వైసీపీ పెయిడ్‌ ఆర్టిస్టులకు రంగంలోకి దించి విధ్వంసక చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విమర్శించారు. అమరావతి రైతుల అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాయపేట నుంచి పట్టణ వీధుల గుండా ర్యాలీ సాగింది. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేతులకు తాళ్లతో సంకేళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రైతులను అరెస్టు చేసిన డీఎస్పీని సస్పెండ్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. బండారు మాధవనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల్లో మనోధైర్యాన్ని దెబ్బతిసేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఆనంతరం కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందించారు. డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ పొత్తూరి రామరాజు, మహిళా అధ్యక్షురాలు రత్నమాల, కొప్పాడ రవి, అకన సుబ్రమణ్యం, గుబ్బల నాగరాజు, జోగి పండు, కాగి త వెంకటేశ్వరావు, శ్రీమన్నారాయణ, వాతాడి ఉమా, భూపతి బాబ్జీ, పి.నాగబాబు, అధికారి అనంతరామారావు, పెమ్మాడి శ్రీదేవి, అంబటి ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T04:25:56+05:30 IST