అడుగు బయటపెడితే ఆసుపత్రి పాలే

ABN , First Publish Date - 2021-07-25T05:06:56+05:30 IST

అడుగు బయటపెడితే ఆసుపత్రి పాలయ్యే పాలయ్యే పరిస్థితి దా పురించిందని పాల కొల్లు,ఉండి ఎమ్మెల్యే లు నిమ్మల రామా నా యుడు, మంతెన రామ రాజు అన్నారు.

అడుగు బయటపెడితే ఆసుపత్రి పాలే
మత్స్యపురి రహదారిపై టీడీపీ నాయకులు నిరసన

ఆకివీడు – పెదకాపవరం రహదారి దుస్థితిపై టీడీపీ నిరసన

 ఆకివీడురూరల్‌/ వీరవాసరం, జూలై 24 :అడుగు బయటపెడితే ఆసుపత్రి పాలయ్యే పాలయ్యే పరిస్థితి దా పురించిందని పాల కొల్లు,ఉండి ఎమ్మెల్యే లు నిమ్మల రామా నా యుడు, మంతెన రామ రాజు అన్నారు. ఆకివీడు –పెదకాపవరం రహదారిలో గుమ్ములూరు గ్రామం వద్ద నీటితో నిండిన గోతిలో చేప పిల్లలను వదిలి, వరినాట్లు వేసి జిల్లాలో రోడ్ల పరిస్థితిపై నిరసన తెలి పారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ ఆక్వా చెరువులయ్యాయని, గడచిన రెండున్నరేళ్లలో గుప్పెడు కంకర, తారు వేసిన దాఖలాలు లేవన్నారు.సంక్షేమంలో రోడ్లు ఒక భాగమని మరిచారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, కేంద్రం నుంచి వస్తున్న నిధులేం చేస్తున్నారో తెలియడం లేదని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. మత్స్యపురి –వీరవాసరం రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మత్స్యపురి రహదారి దుస్థితిపై శనివారం నిరసన ప్రదర్శన చేశారు. వీరవాసరం నుంచి మత్స్యపురి వరకు ఉన్న ఏడు కిలోమీటర్ల రహదారి పలు చోట్ల అధ్వాన స్థితికి చేరిందన్నారు.ఈ కార్యక్రమంలతో  తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి వలవల బాబ్జి, మెంటే పార్థసారఽథి, నర్సాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రామ ప్రసాద్‌ చౌదరి,ప్రాజెక్టు కమిటీ మాజీ  చైర్మన్‌ పొత్తూరి రామ రాజు,మద్దిపాటి ధర్మేంద్ర, మోటుపల్లి రామవరప్రసాద్‌, నౌకట్ల రామారావు, కోపల్లి సాయిబాబా, మర్రివాడ వెంకట్రావు, బచ్చు సరళ, బొర్రా సుజాత, చింతా కనకయ్య, పిప్పళ్ళ నాగేశ్వరరావు, అంకాని సత్యనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:06:56+05:30 IST