దళిత మహిళపై పోలీసుల తీరు బాధాకరం: టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

ABN , First Publish Date - 2022-01-24T04:18:24+05:30 IST

దళిత మహిళ ఉమామహేశ్వరిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివాదం ముదురుతుంది. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళ ఉమామహేశ్వరిపై ..

దళిత మహిళపై పోలీసుల తీరు బాధాకరం: టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

చిత్తూరు: దళిత మహిళ ఉమామహేశ్వరి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వివాదం ముదురుతుంది. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళ ఉమామహేశ్వరిపై జైలు సుపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. 


వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషి పై దొంగతనం పేరుతో తప్పుడు కేసు పెట్టడం దారుణం. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. ఈ ఘటనపై జడ్జి తో విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. పోలీసులు తూతూమంత్రంగా కిందిస్థాయి కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడం సరైంది కాదు. అరాచకాలను రక్షించే పోలీసులే అతి దారుణంగా మహిళపై దాడి చేయడం సిగ్గుచేటు.’’ అని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-01-24T04:18:24+05:30 IST