మినీ మహానాడు విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-06-26T06:41:56+05:30 IST

అంగలూరులో ఈనెల 29న నిర్వహించనున్న మినీ మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టీడీపీ బందరు రూరల్‌ మండల అధ్యక్షుడు కుంచే నాని పిలుపునిచ్చారు.

మినీ మహానాడు విజయవంతం చేయాలి
చినకరగ్రహారంలో బాదుడే బాదుడు నిరసనలో కుంచే నాని

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 25 : అంగలూరులో ఈనెల 29న నిర్వహించనున్న మినీ మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టీడీపీ బందరు రూరల్‌ మండల అధ్యక్షుడు కుంచే నాని పిలుపునిచ్చారు. బందరు మండలం చినకరగ్రహారంలో కుంచే నాని ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కుంచే నాని మా ట్లాడుతూ, నియోజకవర్గం నుంచి అంగలూరుకు 20 వేల మంది  తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.  పంచకర్ల శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి తలారి సోమశేఖర్‌, విజయ్‌, మాజీ ఎంపీటీసీ బోలెం అయోధ్య రామయ్య, మాజీ సర్పంచ్‌ పరసా వడ్డి కాసులు, నాగుల్‌ మీరా, బత్తిన నాగరాజు, షౌకత్‌ ఆలీ   పాల్గొన్నారు. తపసిపూడిలో తెలుగు రైతు అధ్య క్షుడు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు  నిర్వహించారు. మెండు భానుమూర్తి, లంకే శేషగిరిరావు, శ్రీపతి నాంచారయ్య, లంకే హరికృష్ణ, తోట రాము, సిరివెళ్ళ సాంబ య్య, సిరివెళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కృత్తివెన్ను : ఈ నెల 29న అంగలూరులో జరిగే టీడీపీ  మినీ మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ పిలుపునిచ్చారు.  మినీ మహానాడు విజయవంతాన్ని కాంక్షిస్తూ శనివారం మండల పార్టీ సమావేశం నిర్వహించారు.  పెద్ద సంఖ్య లో కార్యకర్తలు, అభిమానులు హాజరై, విజయవంతం చేయాలన్నారు. ఆదివారం కాగిత కృష్ణప్రసాద్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలను నిర్వహించారు.  కేక్‌ను కాగిత కట్‌ చేశా రు. మండల పార్టీ అధ్యక్షుడు ఒడుగు తులసీరావు, పిన్నెంటి రత్తయ్య, నెక్కంటి భాస్కరరావు, కూనసాని చిన్న, చిలుకూరి చంద్రశేఖర్‌, కూనసాని శ్రీనివాసరావు, చేకూరి వెంకట్రావు, తిరుమాని ఏసు, బస్వాని బంగార్రాజు, చెన్నకేశవరావు, మురళీ, ఆంజనేయులు పాల్గొన్నారు

 ఇంటింటి ప్రచారం

గుడివాడ టౌన్‌  :  అంగలూరులో ఈ నెల 29న జరిగే టీడీపీ మినీ మహానాడును జయప్రదం చేయడానికి గుడివాడలో తెలుగు మహిళా కార్యకర్తలు నడుం బిగించాయి.  మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు శనివారం తెలుగు మహిళ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యార్లగడ్డ సుధారాణి, గొర్ల శ్రీదేవి  పర్యవేక్షణలో  35వ వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. మహిళలకు బొట్టు పెట్టి మహానాడులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిరిపురపు తులసీరాణి, అసిలేటి నిర్మల, సునీత, రోజా, మేరి, జిల్లా బిసి నాయకుడు మెరుగుమాల బ్రహ్మ య్య, దాసరి సురేష్‌,  మహిళలు పాల్గొన్నారు. 







Updated Date - 2022-06-26T06:41:56+05:30 IST