కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో ఎన్నారై టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం

ABN , First Publish Date - 2022-04-19T01:46:44+05:30 IST

అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారై టీడీపీ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమా

కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో ఎన్నారై టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం

ఎన్నారై డెస్క్: అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారై టీడీపీ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది టీడీపీ నేతలు పాల్గొన్నారు. మల్లిక్ మేదరమెట్ల నవ్యాంధ్ర పునఃనిర్మాణాన్ని కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను సభకు పరిచయం చేశారు. మురళి బొడ్డు పుష్పగుచ్ఛంతో ఆయనకు స్వాగతం పలికారు.


తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుండి నేటి వరకూగల పార్టీ ప్రయాణాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల పాలనా దక్షతలను వివరించారు. వైసీపీ పాలనలో గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. అంతేకాకుండా తనను అణగదొక్కడానికి కుట్రలు జరిగినట్టు పేర్కొన్నారు. నిరంకుశపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో తెలియట్లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభికులు స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. 2024లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పట్టాభిరామ్ ధీమా వ్యక్తం చేశారు. 



అనంతరం సభికులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ లావు, రాము వెనిగండ్ల పట్టాభిరామ్‌ని సన్మానించారు. అలాగే స్నేహ, హేమ పట్టాభిరామ్ సతీమణిని సత్కరించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌తో ఫొటోలు దిగేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. చివరిగా తమ ఆహ్వానాన్ని మన్నించి రావడమే కాకుండా 11 గంటల వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 150 మందికి పైగా సభికులకు కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. సభికులకు విందు భోజనాన్ని ఏర్పాటు చేసిన పెర్సిస్ బిర్యానీ అండ్ గ్రిల్ రెస్టారెంట్ శ్రీధర్ దొడ్డపనేని, ఈ కార్యక్రమ ఏర్పాట్లు సమన్వయ పరిచిన శరత్ అనంతు, వినయ్ మద్దినేని తదితరులకు ఎన్నారై టీడీపీ అట్లాంటా చాప్టర్ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.


Updated Date - 2022-04-19T01:46:44+05:30 IST