మద్యం ఆదాయంతో మైనారిటీల సంక్షేమమా?

ABN , First Publish Date - 2021-12-01T06:02:46+05:30 IST

మద్యం ఆదాయంతో మైనార్టీల సంక్షేమం చేస్తామనటం ముస్లిం మనోభావాలకు (షరియత్‌)కు వ్యతిరేకం అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ అన్నారు.

మద్యం ఆదాయంతో మైనారిటీల సంక్షేమమా?
నినాదాలు చేస్తున్న టీడీపీ నేతలు నసీర్‌ తదితరులు

మహ్మద్‌ నసీర్‌

గుంటూరు, నవంబరు30(ఆంధ్రజ్యోతి): మద్యం ఆదాయంతో మైనార్టీల సంక్షేమం చేస్తామనటం ముస్లిం మనోభావాలకు (షరియత్‌)కు వ్యతిరేకం అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ అన్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ గుంటూరు హిమని సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మగళవారం ఆయన స్థానిక నేతలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ మద్యం తాగితేనే సంక్షేమం అనే దుస్థితికి జగన్‌ పాలన దిగజారిందన్నారు. ప్రభుత్వ  తీరును ముస్లిం ఇమామ్‌లు చీదరించుకుంటున్నారని తెలిపారు. ఇదిపూర్తిగా ముస్లిం మతాచారాలకు వ్యతిరేకం అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీసెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌, నేతలు ఎస్‌ఎస్‌పీ జాదా, పఠాన్‌ జమీర్‌, షేక్‌ రఫీ, షేక్‌ అఫ్జల్‌, ఎస్కే రబ్బాని, హుస్సేన్‌, సయ్యద్‌ అన్వర్‌, నియాజీ, ఉస్మాన్‌, రియాజ్‌, ఇమ్రాన్‌, రసూల్‌, జబీ ఖాన్‌, ఇలాహి, సుభాని తదిరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-01T06:02:46+05:30 IST