రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నం

ABN , First Publish Date - 2021-01-27T04:48:43+05:30 IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని, వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు.

రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నం
అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న సీతారామలక్ష్మి

వైసీపీ పాలనపై తోట సీతారామలక్ష్మి ధ్వజం


భీమవరం, జనవరి 26 : పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని, వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహానికి తోట సీతారామలక్ష్మి, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. జగన్‌ రెడ్డి పాలన మోసపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు ఏసు పాదం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ ఆశయాలకు వ్యతిరేకంగా వైసీపీ పాలన సాగుతుందన్నారు. మైలాబత్తుల ఐజాక్‌బాబు, మద్దుల రాము, కోళ్ళ నాగేశ్వరరావు మెరగాని నారాయణమ్మ, తదితరులు మాట్లాడారు.

Updated Date - 2021-01-27T04:48:43+05:30 IST