టీడీపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆవిర్భావం

ABN , First Publish Date - 2021-07-28T05:44:16+05:30 IST

వైసీపీ పాలనలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఏపీ టీడీపీ నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆరోపించారు.

టీడీపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆవిర్భావం
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నాయీ బ్రాహ్మణ సంఘ నేతలు

అధ్యక్షుడిగా మద్దిరాల గంగాధర్‌

గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఏపీ టీడీపీ నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణుల విద్యార్థి వసతి కమ్యూనిటీ హాలులో మంగళవారం రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మున్నంగి శివశేషగిరిరావు అధ్యక్షతన ఏపీ టీడీపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేశారు.  సంఘం అధ్యక్షుడిగా మద్దిరాల గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చే విధంగా సేవా సంఘం కృషి చేస్తుందన్నారు. సంఘం కమిటీ సభ్యులుగా మున్నంగి శివ శేషగిరిరావు, ముక్కెర రాజు, ముక్కెర శ్రీను, ఉప్పిడి రాము, మల్లికార్జునరావు, సంజీవరావు, ఉంగుటూరి దర్మ శివపార్వతి నియమితులయ్యారు. కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన టీడీపీలోని నాయీ బ్రాహ్మణ నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-28T05:44:16+05:30 IST