న్యూఢిల్లీ: జగన్ కేసులను త్వరతగతిన విచారణ చేపట్టాలని టీడీపీ ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పెంపు బిల్లు సందర్భంగా రాజ్యసభలో కనమేడల మాట్లాడారు. ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణలో జాప్యం తగదన్నారు. జగన్‌పై దాఖలైన కేసులను సాగదీస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. వీలైనంత త్వరగా కేసులను విచారణ చేపట్టాలని లేదంటే కేసుల నుంచి బయట పడేందుకు జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు.