దయనీయంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి: Ashosk babu

ABN , First Publish Date - 2022-06-07T16:44:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు.

దయనీయంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి: Ashosk babu

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు(parchuri ashok babu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నాయకుల వైఫల్యమని అధికారులు, అధికారుల వైఫల్యమని నాయకులంటున్నారని మండిపడ్డారు. 13లక్షల42వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేనిదిగా మారిందని తెలిపారు. ఉద్యోగస్థులకు 1వ తేదీనే జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. 70 సంవత్సరాలు దాటినవారికి అడిషనల్ కోటా పెన్షన్‌ను తీసేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడం బాధాకరమన్నారు. జాతీయ విద్యా ప్రమాణాల ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతం ఉండాలని ఆయన చెప్పారు.


22 వేల మంది హెల్త్ కమిషన్ ఉద్యోగులకు కేంద్ర వాటా ఉందని.. రాష్ట్ర వాటా లేదన్నారు. ఉద్యోగుల ఖర్చుపై తప్పుడు లెక్కలు ఇచ్చి తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రతి ఉద్యోగికి ఇల్లు ఇస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో వ్యవస్థలు దిగజారి పరిపాలన అస్తవ్యస్థమైందన్నారు. ఉద్యోగుల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నా ఫలితం శూన్యమని అశోక్ బాబు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-07T16:44:57+05:30 IST