‘జనహతుడి’ గా సీఎం జగన్ వ్యవహారం : చెంగల్రాయుడు

ABN , First Publish Date - 2021-05-08T20:45:54+05:30 IST

కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేని వ్యక్తి సీఎం జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ

‘జనహతుడి’ గా సీఎం జగన్ వ్యవహారం : చెంగల్రాయుడు

అమరావతి : కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేని వ్యక్తి సీఎం జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దెప్పి పొడిచారు. ఈ సమాధానం చెప్పలేకే ప్రతిపక్ష నేతపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో కోవిడ్ అంశాన్ని 33వ అంశంగా చేర్చినప్పుడే సీఎం ఆలోచన తమకు అర్థమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనహితుడిగా ఉండాల్సిన సీఎం తన అజ్ఞానంతో జనహతుడిగా మారుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంభవించే మరణాలన్నీపారా సిటమాల్ వేసుకోక, బ్లీచింగ్ పౌడర్ చల్లక జరుగుతున్నవేనా? అంటూ నిలదీశారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడేసివిర్ ఇంజక్షన్లతో సహా అన్ని రకాల మందులు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న విషయం సీఎంకు తెలియదా? అని నిలదీశారు. మంత్రులేమో తమ ప్రకటనల్లో ఆక్సిజన్ ఉందని అంటారని, ప్రైవేట్ ఆస్పత్రులేమో ఆక్సిజన్ లేదని అంటారని ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. ఏ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నారో సీఎం జగన్ చెప్పాలని చెంగల్రాయుడు సవాల్ విసిరారు. 



Updated Date - 2021-05-08T20:45:54+05:30 IST