AP: ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-09-09T15:50:18+05:30 IST

కేసరపల్లిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

AP: ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత

విజయవాడ: కేసరపల్లిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.  ఎమ్మెల్సీ అర్జునుడుని గన్నవరం పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలు పోలీసు జీపుకు అడ్డుపడి రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు. వెంటనే పోలీసులు బలవంతంగా కార్యకర్తలను పక్కకు లాగేశారు.


ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ...కొవిడ్ నిబంధనలు ఒక్క ప్రతిపక్షాలకేనా... వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు వర్తించావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. దిశ చట్టాన్ని అడ్డపెట్టుకుని ప్రజలను  జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. 64 మందిపై అఘాయిత్యాలు జరిగితే 15 మందిపైనే కేసులా అని నిలదీశారు. నారా లోకేష్ పర్యటన అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. బాధితులను పరామర్శించడం నేరమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి కరోనా నిబంధనలు గుర్తు రాలేదా అంటూ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. 

Updated Date - 2021-09-09T15:50:18+05:30 IST