Abn logo
Sep 25 2021 @ 11:17AM

రాష్ట్ర అభివృద్ధి శూన్యం.. రాజధాని లేకపోవడం బాధాకరం: అశోక్

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య విధాన పరిషత్‌లు పూర్తిగా నాశనమయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి శూన్యమని, రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయని చెప్పారు. ప్రభుత్వానికి అప్పగించమని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజుకు ఇచ్చినట్లుగా కౌన్సలింగ్ ఇవ్వడం బాధాకరమన్నారు.


ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకొని అన్యాయానికి పాల్పడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన తెలిపారు. 9వేల మంది టీచింగ్ స్టాఫ్, 5 వేల నాన్ టీచింగ్ స్టాఫ్‌ని ప్రభుత్వం తీసుకుంటే పనిచేస్తున్నవారు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని అన్నారు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకు గాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యముంటుందని.. కావున కేంద్రం కల్పించుకోవాలని అశోక్ బాబు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption