అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే యోచనలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు హాజరు కావాలా, వద్దా అనే అంశంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ప్రకటించి అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించారు. చంద్రబాబు లేకున్నా అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్న క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి వెళ్లినా సమస్యలను ప్రస్తావించే అవకాశం వైసీపీ ఇవ్వదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. టీడీఎల్పీలో చర్చించి అసెంబ్లీ సమావేశాల హాజరుపై తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి