Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెలిగొండ ప్రాజెక్టుపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు: Gottipati

ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయవలసిన అవసరం టీడీపీకి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ లేఖలపై స్పందించక పోవడం వల్లే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి సమస్య తీవ్రతను వివరించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రాంతం వారికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తప్పని సరిగా న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామి ఇచ్చారని తెలిపారు. జిల్లాకు రావలసిన నాగార్జున సాగర్  నీటి వాటా 72 టీఎంసీలను ఈ ఏడాదైనా కేటాయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పెన్షన్ హామీనీ నెరవేర్చడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో అధికార పార్టీ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందన్నారు. కోర్టులకు వెళ్తేనే కొన్ని సమస్యలు ప్రస్తుతం పరిష్కారం కావటం లేదని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని... ఇతర రాష్ట్రాల అభివృద్ధిని చూసైనా ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలని గొట్టిపాటి రవికుమార్ హితవుపలికారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే రవికుమార్....అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల్లో లభ్దిదారులకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 


Advertisement
Advertisement